Friday, 8 May 2020

Subhani

స్టేట్మెంట్సా .... కడుపు మంటా ??
*****************************
ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని , ఇప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కించపరచాలని , విమర్శించాలని కాదుగానీ ....అసలు ఎమిటీ ఈయన ఇలా తయారయ్యాడు ! ఈయన కేమయినా జబ్బు చేసిందా లేక ఏమయినా గబ్బు పట్టిందా ?
విశాఖపట్నం విషాద ఘట్టంలో చనిపోయిన వారికి కోటి రూపాయలు ముఖ్యమంత్రి ప్రకటిస్తే .. "కోటి రూపాయలు ప్రకటిస్తే పోయిన మనుషులు తిరిగి వస్తారా" అని ఒకసారి , ....."కోటి రూపాయలు సరిపోతాయా" అని ఒకసారి , ..."అసలు డబ్బులు ఎవరు అడిగారు" ...అని మరోసారి స్టేట్మెంటా ?
అసలు ఇది అతని స్టేట్మెంటా ?.లేక కోటి ఇచ్చి నందుకు కడుపు మంటా ?
" ఐదుగురు ఐఏఎస్ లతో కమిటీ వేస్తే వాళ్ళేం చేస్తారు ? సైంటిఫిక్ , టెక్నికల్ అంశాలు వాళ్లకేం తెలుసు ? వాళ్ల సంగతి నాకు తెలియదా ?" అంటారు . అవును ఆయనకు వాళ్ల విషయం ఒకటే తెలుసు ... ఎక్కడో డ్రాఫ్ట్ అయిన కాగితాల మీద లెటర్ల మీద కళ్లు మూసుకుని సంతకాలు చెయ్యటం , ఆయన చేయించటం . బుర్రలతో పని ఎక్కడ చేయించారు . మనకు అసలు ఎక్సపర్ట్లు యనమల , అచ్చయ్య , బుచ్చయ్య లాటివాళ్లు కదా!!
ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గిర పనిచేస్తున్న IAS లు వళ్ళు దగ్గిర పెట్టుకుని , బుర్రల్ని పదును పెట్టుకుని ఆ ఆ రంగాలలో ఉన్న ఎక్సపర్ట్లను సంప్రదించి రిపోర్ట్ సమర్పిస్తారు .. గత కొన్ని నెలల నుండి IAS ల పనితీరు గమనిస్తే కదా తెలిసేది . మూతికి మాస్కులతో పాటు కళ్లకు గంతలు కట్టుకున్నవాళ్లకు ఏమి తెలుస్తుంది ఇప్పుడు IAS లు కరోనా విపత్తు తో ఎలా పనిచేస్తుంది . అవకాశం ఇవ్వాలే కానీ IAS లు ఎప్పుడూ ఎక్స్పర్ట్ లే !
" నేనుంటే నేరుగా ఫ్యాక్టరీలోకే వెళ్లేవాడిని " ... !!. అలా ఏ ముఖ్యమంత్రి చేసినా చెప్పకూడదు కానీ ఈ పాటికి మూడో రోజు అయ్యుండేది . స్టైరీన్ అంటేనే తెలీదు అంటునే నేరుగా లోపలకు పోతానంటాడేమిటీ ?ఏమి పీకుదామని !! ఇక్కడ దూరాల్సింది ఈయన కాదు ఎక్స్ఫర్ట్ లు . అంతా ఓవర్ యాక్షన్ !!
కనీసం... ఎవరి అదేశాలు కోసమూ ఎదురు చూడకుండా , ముఖ్యమంత్రి వచ్చేదాకా ఎదురు చూడకుండా 24 గంటల్లోగా ప్రాణ నష్టాన్ని , పరిస్థితి ని అదుపు చెయ్యగలిగిన అధికార యంత్రాంగాన్ని , వైద్యులను కనీసం మాట మాత్రం కూడ ఒక్క మెచ్చుకోలు మాట కూడా చెప్పని ముచ్చు మనిషి నుండి మంచి మాటలు ఏమి ఆశించగలం .
"గ్యాస్ లీకేజీ విషయాన్ని సీఎం చాలా లైట్ గా తీసుకున్నారు .." సీఎం స్వయంగా వచ్చి , చనిపోయిన వాళ్లకి కోటి ప్రకటించి , kgh కు వెళ్లి బాధితులను పరామర్శించి , కమిటీ ఏర్పటు చేసి ,
సీ ఎస్ ను , మంత్రుల బృందాన్ని అక్కడ పర్యవేక్షణకు పెట్టటం ఇందంతా ఆయనకు లైట్ గా అనిపించవచ్చు ... కానీ ఇలా చచ్చు స్టేట్మెంట్లు , విమర్శలు చేసుకుంటూ పోతుంటే ముందు ముందు ఈ ప్రతిపక్ష నాయకుడ్ని జనాలు చాలా లైట్ గా తీసుకునే ప్రమాదంవుంది ..
ఆయన గమనించుకొని పంథా మార్చుకుంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ మూతపడకుండా ఉంటుంది .
🥀 u b h a n i .

ilapavuluri

Iహ్హాహ్హా...ఐఏఎస్ లు!!
@@@
లక్షలమంది ఆ సర్వీస్ లో చేరాలని స్వప్నిస్తుంటారు. కానీ ఏ పదిమందికో పదిహేను మందికో ఆ అదృష్టం దక్కుతుంది. వయసు పాతిక కూడా ఉండదు. జిల్లా మొత్తానికి సర్వాధికారి. సీనియర్ అధికారులు, ఉద్యోగులు కూడా ఆ పాతికేళ్ల కుర్రాడి ముందుకు వెళ్తే రెండు చేతులు జోడించి నమస్కరించాల్సిందే. ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి మాత్రమే అధిపతి. అలాంటి ఏడెనిమిదిమంది ఎమ్మెల్యేలకు ఆ పాతికేళ్ల కుర్రాడు అధిపతి! ఐఏఎస్ కావాలంటే ఎన్నెన్నో అడ్డంకులను అధిగమించాలి. ఎన్నెన్నో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్వ్యూలు, రాతపరీక్షలు...వైకుంఠవాసుని దర్శనం కావాలంటే సప్తద్వారాలను ఎలా దాటాలో, ఐఏఎస్ అనిపించుకోవాలంటే అంతకు మించి ప్రయాణించాలి. ఇక ఆ ఐఏఎస్ చీఫ్ సెక్రెటరీ అయ్యారంటే రాష్ట్రంలోని అయిదారు లక్షలమంది ఉద్యోగులకు బాస్ అనిపించుకుంటాడు. అతని మాట శిలాశాసనం.
ఇక ఐఏఎస్ అనగానే అతను సర్వజ్ఞుడని, సకలకళావల్లభుడని, అతని జ్ఞానం, విషయపరిజ్ఞానం సాగర సమానమని, అనేక రంగాల్లో ప్రవేశం కలిగి ఉంటాడని, నాలుగైదు భాషలను అనర్గళంగా మాట్లాడే శక్తిని కలిగిఉంటాడని ఇన్నాళ్లూ నాకో అభిప్రాయం ఉండేది. నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐఏఎస్ లకు నాలెడ్జ్ ఉండదని, విషయం పరిజ్ఞానం ఉండదని కుండబద్దలు కొట్టి నా కళ్ళు తెరిపించాడు! అంతే కాదు...స్టైరిన్ అనే విషవాయువు గూర్చి తనకే తెలియదని, ఇక ఐఏఎస్ లకు ఏమి తెలుస్తుందని మరో సత్యాన్ని దర్శింపజేశారు. "మహాభారతం లో ఉన్నవన్నీ ఈ ప్రపంచంలో ఉన్నాయి. మహాభాతంలో లేనివేవీ ఈ ప్రపంచంలో లేవు" అని మహాభారతం గూర్చి ఒక ప్రాశస్త్యం ఉన్నది. అలాగే ప్రపంచంలో ఉన్నవన్నీ చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబుకు తెలియనివి ఏవీ ఈ ప్రపంచంలో లేవు." అని ఇకనుంచి చంద్రస్త్రోత్రం చేసుకోవాలి.
చాలాకాలం క్రితం ఒక పత్రికలో చదివేను. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారి మీద కోపంతో చేతిలోని ఫైల్ ను విసిరేస్తే...ఆయన కోపించి "నేను తలచుకుంటే ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరి ముఖ్యమంత్రిని కాగలను...మీరు ఈ జన్మలో ప్రభుత్వంలో అటెండర్ కూడా కాలేరు" అని హెచ్చరించాడట!
ఏవీ అలనాటి ఐఏఎస్ ధీరులు? చంద్రబాబు తమను అంత దారుణంగా విమర్శించినా, చచ్చు పీనుగుల్లా పడిఉన్నారు ఐఏఎస్ అధికారులు! సిగ్గుచేటు!!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు
(ఈ వ్యాసం www.jaihojagan.com కోసం వ్రాయబడినది. ఫౌండర్:: శ్రీ దేవరకొండ రామభాస్కర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ)